133 మంది విద్యార్థుల మృతి | over 130 students dead in pak terror attack | Sakshi
Sakshi News home page

133 మంది విద్యార్థుల మృతి

Published Tue, Dec 16 2014 3:00 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

133 మంది విద్యార్థుల మృతి

133 మంది విద్యార్థుల మృతి

పాకిస్థాన్ ఉగ్రవాద దాడిలో దాదాపు 137 మంది విద్యార్థులు మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ ఉగ్రవాద దాడిలో దాదాపు 133 మంది విద్యార్థులు మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మరో 200 మంది వరకు గాయాల పాలయ్యారు. పెషావర్లోని ఆర్మీ పాఠశాలలో జరిగిన ఈ దాడిలో వంద మంది మరణించినట్లు ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలుత కేవలం 23 మంది మాత్రమే మరణించినట్లు భావించినా, లోపలున్న ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపి, ముగ్గురిని హతమార్చడంతో ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయారు.

మొత్తం 133 మంది విద్యార్థులు,  9 మంది టీచర్లు ఈ ఉగ్రదాడిలో మరణించినట్లు జాతీయ మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి. 960 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దుర్ఘటన విషయం తెలియగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయల్దేరారు. కాగా, భారీ సంఖ్యలో గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వస్తుండటంతో పెషావర్లోని ఆస్పత్రిలో రక్తానికి తీవ్ర కొరత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement