
పెషావర్ స్కూల్లో ఏం జరిగిందంటే...
పెషావర్ ఉగ్రవాద ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఉగ్రవాదులు అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు. సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.మంగళవారం పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన ఉగ్రవాద దాడి వివరాలిలా ఉన్నాయి.
- ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు వెనుక గేటు నుంచి స్కూల్లోకి ప్రవేశించారు.
- ఆ సమయంలో స్కూల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
- ఉగ్రవాదులు స్కూల్లోకి వెళ్లగానే ఓ వాహనాన్ని పేల్చివేశారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు.
- ఒక్కో తరగతిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు.
- చిన్నారులను ఉగ్రవాదులు మానవ కవచంగా చేసుకున్నారు.
- స్కూల్లో 15 పేలుళ్లు సంభవించాయి.
- పిల్లలతో సహా ఇప్పటిదాకా 130 మంది మరణించారు. దాదాపు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- ఉగ్రవాదులు ఓ టీచర్ ను సజీవ దహనం చేశారు.
- ఉగ్రవాదులు కాల్పులు జరిపిన అరగంటకు సైన్యం స్కూలును చుట్టుముట్టింది.
- పిల్లలను రక్షించేందుకు సైన్యం ప్రతిదాడి ఆరంభించింది.
- సైన్యం దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు.
- స్కూలు నుంచి పిల్లలను తరలిస్తున్నారు.
- పెషావర్లో ఇంకా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.
- సైన్యం 45 మంది విద్యార్థులను రక్షించింది.
- ఉగ్రవాద చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
- పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెషావర్ చేరుకున్నారు.
- పాక్లో మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.
- భారత ప్రధాని నరేంద్ర మోదీ పెషావర్ ఘటన పట్ల తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్య అత్యంత హేయమని చర్యని మోదీ అభివర్ణిస్తూ, తీవ్రంగా ఖండించారు.