వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ శనివారం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘అమెరికాలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను పరిరక్షించటానికి.. తాజాగా చోటు చేసుకున్న నేరాలపై చర్యలు తీసుకునే విధంగా కట్టు దిట్టమైన పరిపాలనా పర ఆదేశాలపై సంతకం చేసినందుకు గర్వంగా ఉంది. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడేవారికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి’’ అని హెచ్చరించారు. ( గుర్రం దింపుతున్నారు!)
కాగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చోటు చేసుకున్న నిరసనల్లో వైట్ హౌస్ దగ్గరలోని మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్‌సన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దీనిపై స్పందించిన ట్రంప్.. విధ్వంసానికి పాల్పడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని స్మారక కట్టడాలను, విగ్రహాలను కాపాడుకునేలా ఆదేశాలు తీసుకొస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment