అక్రమ వలసదారులపై యూఎస్‌ కొరడా | Trump government has issued fresh orders to the immigration authorities. | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులపై యూఎస్‌ కొరడా

Published Sat, Apr 15 2017 1:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

అక్రమ వలసదారులపై యూఎస్‌ కొరడా - Sakshi

అక్రమ వలసదారులపై యూఎస్‌ కొరడా

వాషింగ్టన్‌: సరైన అనుమతి పత్రాల్లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై కఠిన చర్యలకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ట్రంప్‌ సర్కారు తాజా ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా సిలీకాన్‌ వ్యాలీలోని భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, మధ్య అమెరికాలోని వలస కార్మికులే లక్ష్యంగా తనిఖీలు జరపవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్‌కు చెందిన అధికారులను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఈ కేసుల్ని త్వరితగతిన విచారించేందుకు మరింత మంది న్యాయమూర్తుల్ని నియమించనున్నారు. తక్షణం తనిఖీలను ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement