
వాషింగ్టన్ : అణ్వాయుధాలతో ప్రపంచాన్ని కలవర పరుస్తున్న ఇరాన్, ఉత్తర కొరియాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రక్షణ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏం జరిగింది? ఏం చర్చించారు అనే అంశాల కన్నా.. రక్షణశాఖ అధికారులతో ట్రంప్ చిరునవ్వులు చిందిస్త మాట్లాడుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోపై స్పందించిన పలువురు జర్నలిస్టులు.. ట్రంప్‌తో ఇది తుఫాను ముందు ప్రశాతంతను అనుకోవాలా అన్ని ప్రశ్నించారు. దానికి కూడా ట్రంప్ చిరునవ్వులు చిందిస్తూ.. అయితే కావచ్చునేమో అని నర్మగర్భంగా వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment