ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్‌గేట్స్ బుధవారం అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో ఇలాంటి నిర్ణయాలు సహేతుకం కాదని పేర్కొన్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుంటోందని, ఈ సంస్థ అవసరం ప్రపంచానికి ఎంతైనా ఉందని అన్నారు. జనవరి చివర్లో కరోనా వైరస్‌ను పబ్లిక్ ఎమర్జెన్సీగా డబ్యూహెచ్‌వో ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరపున 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని బిల్‌గేట్స్ ప్రకటించింది. ఇంత భారీ మొత్తం విరాళాన్ని ప్రకటించడం ఇది మొదటిసారేం కాదు. గతంలోనూ చైనాలో క్షయ వ్యాధి నియంత్రణకు 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. ఇక అమెరికాలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేయాలంటూ బిల్‌గేట్స్ సహా పలువరు నిష్ణాతులు కోరినా ట్రంప్ అవేమీ పట్టించుకోలేదు. ఫలితం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రజలను అల్లాడిస్తుంది.
ఇక డబ్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ స్పందించింది. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఈ సమయంలో ట్రంప్ నిర్ణయం ప్రమాదరకరమైనందంటూ అభిప్రాయపడింది. ఈ మేరకు డాక్టర్ ప్యాట్రిస్ హారిస్ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment