పాక్ లో మరో ఇద్దరికి ఉరి
ఓ ఇద్దరు ఖైదీలకు ఉరితీత సంబంధించిన నోటీసులను పాకిస్థాన్ ఉగ్రవాద కేసుల పరిష్కరణ న్యాయస్థానం జారీ చేసింది. మార్చి 5న వారిని ఉరితీయనున్నట్లు అందులో పేర్కొంది. 1998లో మహమ్మద్ ఫైజల్, మహమ్మద్ అఫ్జల్ అనే ఇద్దరు నేరస్థులు కోరంగి అనే ప్రాంతంలో దొంగతనానికి పాల్పడి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. దీంతో వారికి 1999లో కింది స్థాయి కోర్టు మరణ శిక్ష విధించింది. మరణ శిక్షను సవాల్ చేస్తూ వారు... పై కోర్టులకు వెళ్లినా కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించాయి. అంతేకాకుండా రాష్ట్రపతి కూడా వారి క్షమాభిక్షను ఈ నెల 17న తోసిపుచ్చారు. దీంతో వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.