వీళ్లు దొంగలు కాదు బాబోయ్.. గజదొంగలు | U.S. Mexico drug tunnel spanned 800 yards, held 2 tons of cocaine | Sakshi
Sakshi News home page

వీళ్లు దొంగలు కాదు బాబోయ్.. గజదొంగలు

Published Fri, Apr 22 2016 4:36 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

వీళ్లు దొంగలు కాదు బాబోయ్.. గజదొంగలు - Sakshi

వీళ్లు దొంగలు కాదు బాబోయ్.. గజదొంగలు

కాలిఫోర్నియా: మత్తుపదార్థాల రవాణా దొంగలు అమెరికా పోలీసులను అవాక్కయ్యేలా చేశారు. దాదాపు అరమైలు వరకు భూగర్భంలో సొరంగం తవ్వి డ్రగ్స్ రవాణాకు పాల్పడ్డారు. కాలిఫోర్నియా-మెక్సికో సరిహద్దులో బయటపడిన ఈ సొరంగం అమెరికా ఫెడరల్ ఏజెంట్స్ గుర్తించారు. అంతేకాదు.. ఈ సొరంగ మార్గంలో రెండు టన్నుల కొకైన్, గంజాయి కూడా లభ్యం అయింది. దీని ధర దాదాపు 22 మిలియన్లలో ఉంటుంది.

మెక్సికోలోని తిజువానా అనే ప్రాంతంలో ఓ నివాసంలో ప్రారంభమైన ఈ సొరంగం సరిహద్దు గుండా దాదాపు 800 యార్డుల పొడవు విస్తరించి ఉండి శాన్ డియాగోకు సమీప ప్రాంతంలోని ఒటె మెసా వరకు ఉంది. చెక్కలతో వెళుతున్న ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడం గుర్తించిన పోలీసులు ఆ తర్వాత కొద్ది రోజులపాటు విచారించి సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగానికి ప్రత్యేక వెంటిలేషన్ సిస్టమ్, లైట్లు, పెద్దపెద్ద ఎలివేటర్స్ కూడా ఏర్పాటుచేశారు. ఎట్టకేలకు నేరస్థులను గుర్తించిన పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement