చాక్లెట్ ప్రియులకు స్వీట్ న్యూస్!
లండన్: చాక్లెట్ ప్రియులకు శుభవార్త. ఇప్పటివరకూ చాక్లెట్ రుచిని ఆస్వాదించిన గ్రాడ్యుయేట్లకు ఓ అరుదైన అవకావం లభించనుంది. యూకే, బ్రిస‍్టల్‌లోని యూనివర్సిటీస్ ఆఫ్ ఫాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ అప్లైడ్ సైన్సెస్ చాక‍్లెట్ల తయారీపై పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ ఫిబ్రవరి 27లోగా బ్రిస‍్టల్‌లోని ఈ వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు ఏడాదికి 12.5 లక్షల రూపాయల స్కాలర్‌షిప్ అందుతుంది.
విదేశాలలో కష్టపడి చదవడమే కాదు ఇష్టపడి ఎంతో నేర్చుకునే కోర్సులు ఉన్నాయని తీపి ఉత్పత్తులతో ప్రపంచంలోనే మేటీ కంపెనీలో ఒకటైన మండెలెజ్ ఇంటర్నేషనల్ అంటోంది. కాడ్బరీ, మిల్కా, ప్రిన్స్, మొదలైన చాక్లెట్ కంపెనీల ఉత్పత్తులను ఎలా చేయలో నేర్చుకోవడంతో పాటు వాటిని టెస్ట్ చేసి సులువుగా థీసిస్ తయారుచేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. బ్రిస్టల్ వర్సీటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకునే వారికి మండెలెజ్ కంపెనీ జాబ్ ఆఫర్‌తో పాటు కోర్సు సమయంలో ట్రెయినీ ఉద్యోగులుగా నియమించనున్నట్లు ప్రకటించింది.