Mondelez International
-
చాక్లెట్లో ‘బీఫ్’ ఆరోపణలు.. క్యాడ్బరి క్లారిటీ
Cadbury Beef Controversy: ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ అలరించే క్యాడ్ బరి చాక్లెట్ యాడ్ గురించి మనందరికి తెలిసిందే. ఆ యాడ్ చూసిన వారెవరైనా వెంటనే ఆ చాక్లెట్ కొనుక్కొని తినేయాలనే అనుకుంటారు. అందుకే ఆ చాక్లెట్ అంటే ఇష్టపడని వారుండరు. బాధైనా, సంతోషమైనా ఆ చాక్లెట్ తింటూ ఆ ఫీలింగ్‌ను షేర్ చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత పాపులర్ అయిన ఈ చాక్లెట్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం క్యాడ్బరీని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో తయారు చేస్తున్నరంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Is this true @CadburyUK? If yes, Cadbury deserves to be sued for forcing Hindus to consume halaal certified beef products Our ancestors &Gurus sacrificed their lives but didn't accept eating beef. But post "independence"rulers have allowed our Dharma to be violated with impunity pic.twitter.com/Ub9hJmG8gO — Madhu Purnima Kishwar (@madhukishwar) July 17, 2021 దీంతో పలువురు నెటిజన్లు యూకే క్యాడ్ బరీ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను తినిపించినందుకు క్యాడ్ బరీపై కేసు పెట్టాలని ట్వీట్ చేశారు. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు. దీంతో ఈ వివాదంపై క్యాడ్బరీ.. ఆకు పచ్చ చుక్క గుర్తును ఉటంకిస్తూ క్లారిటీ ఇచ్చింది. మాండెలెజ్ / క్యాడ్బరీ ఉత్పత్తులు ప్యూర్ వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు క్యాడ్ బరీ చాక్లెట్ ర్యాపర్ పై ఉన్న ఆకు పచ్చ గుర్తు వెజిటేరియన్ అన్న విషయాన్ని సూచిస్తుందంటూ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. pic.twitter.com/798qgPozsF — Cadbury Dairy Milk (@DairyMilkIn) July 18, 2021 చదవండి : మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
చాక్లెట్ ప్రియులకు స్వీట్ న్యూస్!
లండన్: చాక్లెట్ ప్రియులకు శుభవార్త. ఇప్పటివరకూ చాక్లెట్ రుచిని ఆస్వాదించిన గ్రాడ్యుయేట్లకు ఓ అరుదైన అవకావం లభించనుంది. యూకే, బ్రిస్టల్‌లోని యూనివర్సిటీస్ ఆఫ్ ఫాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ అప్లైడ్ సైన్సెస్ చాక్లెట్ల తయారీపై పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ ఫిబ్రవరి 27లోగా బ్రిస్టల్‌లోని ఈ వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు ఏడాదికి 12.5 లక్షల రూపాయల స్కాలర్షిప్ అందుతుంది. విదేశాలలో కష్టపడి చదవడమే కాదు ఇష్టపడి ఎంతో నేర్చుకునే కోర్సులు ఉన్నాయని తీపి ఉత్పత్తులతో ప్రపంచంలోనే మేటీ కంపెనీలో ఒకటైన మండెలెజ్ ఇంటర్నేషనల్ అంటోంది. కాడ్బరీ, మిల్కా, ప్రిన్స్, మొదలైన చాక్లెట్ కంపెనీల ఉత్పత్తులను ఎలా చేయలో నేర్చుకోవడంతో పాటు వాటిని టెస్ట్ చేసి సులువుగా థీసిస్ తయారుచేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. బ్రిస్టల్ వర్సీటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకునే వారికి మండెలెజ్ కంపెనీ జాబ్ ఆఫర్‌తో పాటు కోర్సు సమయంలో ట్రెయినీ ఉద్యోగులుగా నియమించనున్నట్లు ప్రకటించింది. -
మాండెలీజ్‌కు జరిమానా..
-
మాండెలీజ్‌కు జరిమానా..
న్యూఢిల్లీ: భారత కార్యకలాపాల్లో అనుబంధ సంస్థ అవకతవకలకు పాల్పడినందుకు గాను అంతర్జాతీయ కన్ఫెక్షనరీ సంస్థ మాండెలీజ్ ఇంటర్నేషనల్‌కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెడితే.. బ్రిటన్‌కు చెందిన క్యాడ్బరీస్ని అమెరికన్ సంస్థ మాండెలీజ్ 2010లో కొనుగోలు చేసింది. దీంతో క్యాడ్బరీస్ భారత విభాగం మాండెలీజ్‌కు అనుబంధ సంస్థగా మారింది. ఇది గతంలో (2009) హిమాచల్ ప్రదేశ్‌లో ప్లాంట్ విస్తరణకి అవసరమైన నియంత్రణపరమైన అనుమతుల కోసం క్యాడ్బరీస్ ఇండియా అనధికారిక ఏజంటుకు సుమారు రూ. 62 లక్షలు ముట్టచెప్పినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో అవినీతి చట్టాల ఉల్లంఘన కిందకి వచ్చే ఈ అభియోగాలపై విచారణ జరిపిన ఎస్ఈసీ తాజాగా మాండెలీజ్‌కు జరిమానా విధించింది. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పెనాల్టీ చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.