భారత కార్యకలాపాల్లో అనుబంధ సంస్థ అవకతవకలకు పాల్పడినందుకు గాను అంతర్జాతీయ కన్ఫెక్షనరీ సంస్థ మాండెలీజ్ ఇంటర్నేషనల్‌కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెడితే.. బ్రిటన్‌కు చెందిన క్యాడ్‌బరీస్‌ని అమెరికన్ సంస్థ మాండెలీజ్ 2010లో కొనుగోలు చేసింది. దీంతో క్యాడ్‌బరీస్ భారత విభాగం మాండెలీజ్‌కు అనుబంధ సంస్థగా మారింది.