
ఉగ్రవాదంపై ఆత్మవంచన సరికాదు
న్యూయార్క్: మానవ మనుగడకే ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం విషయంలో దేశాలు ఆత్మవంచన చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. భారీ సంఖ్యలో శరణార్థుల సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఉగ్రవాదమేనని చెప్పింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో శరణార్థులు, వలసదారులపై జరిగిన సదస్సులో విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ, ‘భౌగోళిక రాజకీయాలే సంక్షోభాలకు కేంద్ర బిందువులు. శరణార్థుల ఉద్యమాలకు ప్రధాన కారణం ఉగ్రవాదమేనని ఇవి నిరూపిస్తున్నాయి’ అని అన్నారు.