మధుమేహ మందుతో మూత్రకోశ కేన్సర్ ముప్పు | Urinary cancer risk with diabetes drug | Sakshi
Sakshi News home page

మధుమేహ మందుతో మూత్రకోశ కేన్సర్ ముప్పు

Published Fri, Apr 1 2016 1:28 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

మధుమేహ మందుతో మూత్రకోశ కేన్సర్ ముప్పు - Sakshi

మధుమేహ మందుతో మూత్రకోశ కేన్సర్ ముప్పు

టొరంటో: మధుమేహానికి వాడే ఓ ఔషధం మూత్రకోశ కేన్సర్ ముప్పును అధికం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించే థయాజోలిడినెడియోన్స్ తరగతికి చెందిన పియోగ్లిటాజోన్‌ను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం ఉందని కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇతర యాంటీబయోటిక్స్‌తో పోల్చినప్పుడు టైప్-2 మధుమేహ రోగుల్లో పియోగ్లిటాజోన్ వాడకం వల్ల బ్లాడర్ కేన్సర్ అవకాశాలు 63% పెరుగుతున్నాయంది. బ్రిటన్ ‘క్లినికల్ ప్రాక్టీస్ రీసెర్చ్ డేటాబేస్’ నుంచి సేకరించిన వివరాలపై అధ్యయనం చేసిన వర్సిటీ ఈ నిర్ధారణకు వచ్చింది.

 స్కిన్ ప్యాచ్: టైప్2 మధుమేహులకు చెమట ద్వారా గ్లూకోజు స్థాయిలను పసిగట్టి తగిన మోతాదులో ఇన్సులిన్‌ను సూక్ష్మసూదుల ద్వారా శరీరంలోకి పంపే ‘డయాబెటిక్ కంట్రోల్ స్కిన్‌ప్యాచ్’ను కొరియాబృందం అభివృద్ధిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement