
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి సోమవారం ఉత్తర సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఒక పైలెట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని గురించి ఎలాంటి సమాచారం తెలియలేదని వారు వెల్లడించారు. 48 వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్ -15 సీ ఈగిల్ విమానం ఆర్‌ఏఎఫ్ లాకెన్‌హీత్‌లో ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో ఉండగా ఉదయం 9:40 గంటలకు కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న యూకే రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
లాకెన్‌హీత్ అనేది రాయల్ వైమానిక స్థావరం. ఇది అమెరికా వైమానిక దళం లిబర్టీ వింగ్‌గా పిలిచే 48 వ ఫైటర్ వింగ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ స్థావరం లండన్ నుంచి ఈశాన్యంగా 80 మైళ్ల (130 కిలోమీటర్లు) దూరంలో ఉంది.