కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు | US biotech firm Moderna announces positive interim phase 1 | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు

Published Tue, May 19 2020 5:40 AM | Last Updated on Tue, May 19 2020 5:40 AM

US biotech firm Moderna announces positive interim phase 1  - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో తాము ముందడుగు వేసినట్లు అమెరికన్‌ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా సోమవారం ప్రకటించింది. మనుషులపై ప్రాథమికంగా వ్యాక్సిన్‌ టెస్టు నిర్వహించామని, ఆశాజనకమైన ఫలితాలు లభించాయని వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో కరోనాకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తోందని పేర్కొంది. వ్యాక్సిన్‌ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, ఇది పూర్తిగా సురక్షితమేనని తెలిపింది. మార్చి నెలలో  ఈ ప్రయోగం చేశామని, మొత్తం 8 మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చామని మోడెర్నా సంస్థ వివరించింది. ఈ వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయిలో ప్రయోగాలు చేయనున్నట్లు తెలియజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement