వాషింగ్టన్ : కరోనా వైరస్ విజృంభణతో అమెరికా కకావికలం అవుతోంది. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. ఏరోజుకారోజూ అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతూ పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 67, 632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఒక రోజులో ఇన్ని కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట)
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,16,747కు చేరింది. వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,36,400కు చేరింది. మరో 18,30,645 మంది చికిత్స పొందుతుండగా, 16,45,962 మంది బాధితులు కోలుకున్నారు. అలాగే ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ సైతం కరోనా బారిన పడ్డారు. అయితే వచ్చే నెల నాటికి యూఎస్‌లో మరణాల సంఖ్య 1,50,000 వేలకు పెరుగుతాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. (సుందర్ పిచాయ్: ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ రియాల్టీ)
Comments
Please login to add a commentAdd a comment