పారిస్ : కరోనా కారణంగా అన్ని రంగాల సేవలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. అయితే ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన నాంటెస్‌లోని థీమ్ పార్కు పునఃప్రారంభమయ్యింది. సామాజిక దూరం నిబంధనల కారణంగా కేవలం 50 మందిని మాత్రమే పార్కులోకి అనుమతిస్తున్నారు.
సందర్శకులు పార్కులోకి వస్తుండంతో నాంటెస్ ప్రసిద్ద మెకానికల్ ఏనుగు శనివారం తిరిగి సందర్శకులకు దర్శనమిస్తోంది. పూర్తిగా యంత్రాలతో తయారైన ఈ ఏనుగు అక్కడికి వచ్చిన వారిపై నీటిని చల్లుతూ సందర్శకులకు ఆహ్లదం కలిగిస్తోంది. మెల్లగా కదులుతూ గర్జిస్తూ పార్కులోని వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment