లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగాలా? వద్దా? అనే అంశంపై జూన్ 23న జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో వైదొలగటానికి (బ్రెగ్జిట్‌కి) అనుకూలంగా ఓటేసినందుకు 23 లక్షల మంది బ్రిటన్ పౌరులు చింతిస్తున్నట్లు ఒపీనియమ్ సర్వే చెప్తోంది. బ్రెగ్జిట్‌లో ఈయూను వీడాలంటూ ఓటేసిన వారిలో 7 శాతం మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
తమకు మళ్లీ అవకాశం ఉంటే ఈయూలో కొనసాగాలని ఓటేస్తామన్నారు. అంటే.. బ్రెగ్జిట్ ఫలితాల్లో అనుకూలంగా పోలైన ఓట్ల నుంచి ఈ 23 లక్షల మంది ఓట్లను తీసేస్తే.. ఆ ఫలితాలు తారుమారవుతాయి. అలాగే.. ఈయూలో కొనసాగాలంటూ ఓటేసిన వారిలో సైతం మూడు శాతం మంది దానిపై విచారం వ్యక్తం చే శారు. మరోపక్క.. బ్రె గ్జిట్ ఫలితాల ప్రకటన అనంతరం బ్రిటన్‌లో జాతి విద్వేష పూరిత నేరాలు పెరిగాయి. ఇటువంటి నేరాలకు సంబంధించి గత వారం రోజుల్లో 331 కేసులను బ్రిటన్ పోలీసులు నమోదు చేశారు.
బ్రెగ్జిట్‌కు ఓటేసి తప్పు చేశాం!
Published Sat, Jul 2 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement