
కిందన అంతోటి సైజున్న వేల్ షార్క్.. పైన ఇంతే ఉన్న చిన్నపాటి బోటు.. వేల్ షార్క్ జస్ట్ అలా బుర్రెత్తి పైకి చూస్తే.. బోటు పని అంతే ఉన్నట్లు కనిపిస్తున్న ఈ సూపర్ చిత్రాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ టామ్ కేనన్ తీశారు. ఈ ఫొటోను పశ్చిమ ఆస్ట్రేలియాలోని నింగలూ రీఫ్ ప్రాంతంలో క్లిక్‌మనిపించారు.
వేల్‌షార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద చేప. అసలు కింద ఈ భారీ తిమింగలం ఉందన్న సంగతి బోటులోని వాళ్లకు తెలియదని.. వేల్‌షార్క్ కొంచెం ముందుకు వెళ్లాక దాన్ని చూసి.. ఆనందాశ్చర్యాలకు లోనయ్యారని టామ్ తెలిపారు. సాధారణంగా ఇవి లోతైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని.. ఇలా రావడం అరుదుగా జరుగుతుంటుందని చెప్పారు. సముద్రపు లోతుల్లో తాము చాలా చిత్రాలు తీస్తుంటామని.. ఇలాంటి ఫొటోతీయడం వేలల్లో ఒకసారి మాత్రమే జరుగుతుందని టామ్ అన్నారు.