అమ్మాయిలు ఆ పరీక్షలు చేయించుకుంటేనే..
అమ్మాయిలు ఆ పరీక్షలు చేయించుకుంటేనే..
Published Sun, Oct 2 2016 9:48 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
జెరూసలెం: ఈజిప్ట్ చట్ట సభ సభ్యుడు ఎల్హమి ఎజినా ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. గత నెల ఈయన ఈజిప్ట్ పురుషులు శృంగారంలో బలహీనులని, అందువల్ల మహిళలు తమ శృంగార వాంఛను తగ్గించుకునేలా చికిత్సలు తీసుకోవాలని సూచించి వార్తల్లోకెక్కాడు. దీనిపై మొదలైన దుమారం చల్లారక ముందే తాజాగా మరోసారి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు.
అమ్మాయిలు కాలేజీకి వెళ్లాలంటే ముందుగా తాము కన్యలమనే విషయాన్ని నిరూపించుకోవాలని.. అందుకోసం వారు కన్యత్వ పరీక్షలు చేయించుకోవాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్షల్లో పాసైన వారు మాత్రమే కాలేజీలో చేరాలని ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వారి పరీక్షల ఫలితాలకు సంబంధించిన డాక్యుమెంట్ను అమ్మాయిలు యూనివర్సిటీకి సమర్పించాలని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. పొలిటీషియన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ముందుగా వారికి ఐక్యూ(ప్రజ్ఞా పరీక్షలు) టెస్ట్ నిర్వహించాలని మండిపడుతున్నారు.
Advertisement