నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి | world leaders strongly condemn terrorist attack in Nice | Sakshi
Sakshi News home page

నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

Published Fri, Jul 15 2016 8:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

నీస్: పారిస్ ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే ఫ్రాన్స్ లో మరోసారి ముష్కరులు మారణహోమానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాల్లో నరమేధం సృష్టించారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో పెను విధ్వంసం సృష్టించి 80 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. 100 మందిపైగా క్షతగాత్రులయ్యారు. నీస్ నగరంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు.

నీస్ దాడి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొన్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిని మతిలేని చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.

అమెరికా ప్రజల తరపున భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. నీస్ దాడి నేపథ్యంలో రేపు జరగనున్న విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రదాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement