ఆ స్టీల్‌తో అరవై ఈఫిల్‌ టవర్లు నిర్మించొచ్చట! | World Longest Sea Bridge Going to Begin In China | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 8:47 PM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM

World Longest Sea Bridge Going to Begin In China - Sakshi

మూడు ప్రధాన నగరాలు హాంగ్‌కాంగ్, ఝుహై, మకావ్‌ లను కలుపుతూ చైనా అధునాతనంగా నిర్మిస్తోన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఇంజనీరింగ్‌ వ్యవస్థనే అచ్చెరువొందేలా చేస్తోంది. హాంగ్‌కాంగ్‌ నుంచి చైనా గుండా మకావ్‌ని కలుపుతూ సముద్రమార్గంలో నిర్మించిన ఈ అతి పొడవైన  వారధి అతి త్వరలోనే ఆవిష్కరణకు సిద్ధమౌతోంది. ఈ కట్టడంలోని ప్రత్యేకత ఏమిటో తెలుసా? దీని నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్‌తో 60 ఈఫిల్‌ టవర్‌లను నిర్మించొచ్చట.

55 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో 4,20,000 టన్నుల స్టీల్‌ని ఉపయోగించారు. ఇందులో 6, 7 కిలోమీటర్ల మేర బ్రిడ్జిని సముద్రపు నీటి లోపలినుంచి నిర్మించారు. సముద్రజలాల అడుగున సొరంగ మార్గం కోసం 80,000 టన్నుల పైపులను ఉపయోగించడం ఒక విశేషం. అయితే వాటిని కలపడం మరింత సవాల్‌గా మారిందట.  ఈ ప్రాజెక్టు మొత్తానికి కాస్త అటుఇటుగా 110 బిలియన్‌ యువాన్‌ల ఖర్చు అయివుంటుందని అంచనా. అంచనాలకు మించిన ఖర్చు, అవినీతి తదితర కారణాల వల్ల 2017 చివరికల్లా ప్రారంభించాల్సిన ఈ బ్రిడ్జి కొంత ఆలస్యమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement