హైదరాబాద్ : హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం కువాయిత్‌లోని వైఎస్సార్‌సీపీ (గల్ఫ్) విభాగం తరపున రు.4.7 లక్షల రూపాయల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు ఇచ్చారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బిహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో పలువురు కువాయిత్ ప్రవాసులు కలుసుకుని ఈ మేరకు ఒక చెక్కును అంద జేశారు. కువాయిత్‌లోని తెలుగువారు, సాటి తెలుగువారి భాధల్లో పాలుపంచుకునేందుకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని ఇలియాస్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రవాసుల వితరణకు జగన్ అభినందించారు. జగన్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్‌బాష, మేయర్ కె.సురేష్‌బాబు, కువాయిత్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నాసర్, బాబు పాల్గొన్నారు. దాతలు షేక్ హుస్సేన్, వై.లలితరాజ్, ఎం.వెంకటసుబ్బారెడ్డి (దాసరి సంక్షేమ సంఘం), ఫ్లవర్స్ షాప్ కె.షఫీ, పహాహెల్ ముక్తబ్, వైఎస్సార్‌సీపీ కువాయిత్ కమిటీ సభ్యులు విరాళాల సేకరణకు సహాయసహాకారాలు అందజేశారని ఇలియాస్ కృతజ్ఞతలు తెలిపారు.