యూఎస్‌లోనూ ‘జీ తెలుగు సినిమాలు’
న్యూఢిల్లీ: అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వీక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మీడియా సంస్థ జీ చానెల్ ముందడుగేసింది. ‘జీ తెలుగు సినిమాలు’ చానెల్‌ను ప్రారంభించింది.
తెలుగు ప్రజల జీవితంలో సినిమాలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అంతేకాదు, సినీ ప్రముఖులను వారు ఎంతగానో ఆరాధిస్తారు..ఈ కారణంగానే తాము తెలుగు ప్రజల అభిమాన జీ టీవీ తెలుగు సినిమాలు చానెల్‌ను ప్రారంభిస్తున్నామని జీ అమెరికా బిజినెస్ హెడ్ సమీర్ టార్గే అన్నారు. కొత్త చానెల్‌ను డిష్, స్లింగ్ టీవీల్లో చూడవచ్చని తెలిపారు. బ్రహ్మోత్సం, కుమారి 21ఎఫ్, అఆ, సుప్రీం వంటి హిట్ సినిమాలను తాము తెలుగు వారికోసం అందించనున్నామన్నారు. జీ తెలుగు సినిమాలు ఆరంభంతో అమెరికా వాసులకు అందుబాటులో ఉండే జీ టీవీ చానెల్స్ సంఖ్య 37కు చేరుకుంది.