వినతిపత్రం ఇస్తున్న గ్రామస్తులు
సాక్షి, హుజూరాబాద్: రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయంటే రోడ్డుకు ఇరు వైపుల భూములు, ఇళ్లు ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి విస్తరణ వల్ల తీరని నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. తమ న్యాయపరమైన సమస్యను పరిష్కారించాలని కోరుతూ సింగాపూర్, బోర్నపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ఆర్డీవో బోయపాటి చెన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగాపూర్, బోర్నపల్లి గ్రామాల మీదుగా నేషనల్ హైవే కోసం రోడ్డు విస్తరణ కోసం వ్యవసాయ భూముల సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని, రోడ్డు విస్తరణ మూలంగా తమ వ్యవసాయ భూములను కోల్పోతే జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 110 ఫీట్ల రోడ్డును మాత్రమే వెడల్పు చేయాలని, ప్లైఓవర్‌ను అవసమున్న చోట నిర్మించాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాల రైతులు నిరంజన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి రజనీకర్‌రెడ్డి, రజనీ, చంద్ర ప్రకాష్‌రెడ్డి, శీను, రాజయ్య, రవీందర్, శ్రీనివాస్, రాజ్‌కుమార్,మల్లెష్, చంద్రశేఖర్, చక్రపాణి, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అంజయ్య, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment