ప్రసవాలు లేక ఖాళీగా ఉన్న బెడ్లు
తల్లాడ పీహెచ్‌సీలో ప్రతి నెలా నలుగురికి తగ్గకుండా ప్రసవాలు జరగాల్సి ఉంది. బర్త్ ప్లానింగ్ ద్వారా మోటివేషన్ చేయాల్సి ఉండగా అలా జరగటం లేదు. ఎనిమిది నెలల్లో ఏడు ప్రసవాలు మాత్రమే జరిగాయి. అందులో ఒకటి డెత్ కావటంతో వివాదాస్పదం అయ్యింది. ఎనిమిది నెలల్లో మొత్తం 32 మంది ప్రసవాలు జరగాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. ఒక్కో నెలలో అసలు ఆస్పత్రిలో ప్రసవాలు లేకుండా పోయాయి. వైద్య సిబ్బంది ప్రచార లోపం కారణంగా ప్రసవాలు చేయడంలో తల్లాడ పీహెచ్‌సీ లక్ష్యాన్ని చేరుకోలేక పోతోందనే విమర్శలు విన్పిస్తుయింన్నాయి. దీంతో గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకున్నారు. నెలలు నిండి నొప్పులు వచ్చినప్పటికీ.. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు తప్పా ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం లేదు. అప్పులు చేసి మరీ అక్కడే వైద్యం చేయిస్తున్నారు.
ఏఎన్‌ఎంల కొరత..
మండలంలో పది సబ్ సెంటర్లుండగా.. ఏడు సబ్‌సెంటర్లకు మాత్రమే ఏఎన్‌ఎంలు ఉన్నారు. కుర్నవల్లి, మిట్టపల్లి, మల్లవరం సబ్ సెంటర్లకు అసిస్టెంట్ ఏఎన్‌ఎంలే ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏఎన్‌ఎంలు ఉన్నా మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు.
ప్రభావం చూపని కేసీఆర్ కిట్..
తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం 2017 జూన్ 2న ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అంతగా ప్రభావం చూపలేదు. గ్రామాల్లో ఈ పథకం గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉంది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు తల్లి అకౌంట్‌లో నాలుగు విడతులుగా జమ చేస్తారు. డెలీవరీ సమయంలో రూ.2 వేలు విలువైన కేసీఆర్ కిట్ అందజేస్తారు. అయినప్పటికీ పేదలు కూడా ఆస్పత్రి రావడం లేదు. ఇప్పటి వరకు తల్లాడ సీహెచ్‌సీలో ఆరుగురు మాత్రమే కేసీఆర్ కిట్ అందుకున్నారు.
తల్లాడ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాల్సి ఉంది. తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం.. సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం నుంచి వారికి కిట్‌ను కూడా అందజేస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కన్పించడం లేదు. పథకం ఉద్ధేశం మంచిదే అయినా.. దానిని అమలు చేయడానికి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతగా లేవు. దీంతో వైద్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో విఫలం చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాల్సిన ప్రసవాలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వారు అప్పులు చేసి వేలాది రూపాయలను ప్రైవేట్ ఆస్పత్రుల పరం చేస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో అధికారులు, పాలకులే ఒక్కసారి ఆలోచించాలి. తల్లాడ పీహెచ్‌సీలో ప్రసవానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకుంటున్నారు. నెలలు నిండినా.. నొప్పులు వచ్చినా.. వెంటనే అదే డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల అవసరం ఉన్నా, లేకున్నా సిజేరియన్ చేయించుకొని డబ్బులు ముట్టజేబుతున్నారు
సంఖ్యను పెంచుతాం..
సీహెచ్‌సీలోనే ప్రసవాలు జరిగేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. కేసీఆర్ కిట్టుపై అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన బెడ్లు, థియేటర్ ఇక్కడున్నాయి. ఇక నుంచి ఖచ్చితంగా అన్ని కాన్పులు ఇక్కడే జరుగుతాయి. సిజేరియన్ చేసే పరిస్థితి ఇక్కడలేక పోవంటంతో.. కొంత వెనుకాడుతున్నాం. గర్భిణుల అవసరాన్ని బట్టి ఖమ్మం ఆస్పత్రికి, కల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నాం.
– ఐ.సృజన, మండల వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment