బాలింతకు కేసీఆర్ కిట్టు అందిస్తున్న డీఎంహెచ్‌వో వెంకట్
మోర్తాడ్(బాల్కొండ) : ప్రభుత్వ ఆస్పత్రిలోనే నూటికి 95 శాతం ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ సూచించారు. మోర్తాడ్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రిలో మంగళవారం భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, వేల్పూర్ పీహెచ్‌సీల పరిధిలోని వైద్యు లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్టును ఉచితంగా అందిస్తుందని తెలిపారు. గర్భిణులకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలను కల్పిస్తున్నందున ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్ ప్రసవా లు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా బాలింతలు ఆరుగురికి కేసీఆర్ కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్యాధికారి శివశంకర్, వైద్యులు శ్రీకాంత్, లక్ష్మి, జ్యోతి, డీపీఎంవో వనాకర్ రెడ్డి, పీహెచ్‌ఎన్ మీరాబాయి, ఎస్‌వోవో శ్రీనివాస్, యూడీసీ సురేందర్, సీహెచ్‌వో దేవన్న, ఇతర సిబ్బంది ఆడెపు ప్రభా కర్, హరిత, సత్యనారాయణ, గోవర్ధన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment