రజినీ మురుగన్ చిత్రంలోని ఓ దృశ్యం
సినిమా : రజినీ మురుగన్
తారగణం : శివ కార్తికేయన్, కీర్తి సురేష్, సూరి, రాజ్‌కిరణ్
డైరెక్టర్ : పొన్‌రామ్
భాష : తమిళం
కథ : రజినీ మురుగన్( శివకార్తికేయన్) చిన్నతనంలో కార్తీక(కీర్తి సురేష్)ను అతడికిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు అనుకుంటారు. అయితే రజినీ అల్లరి పని కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ప్రాణస్నేహితులైన రజినీ, కార్తీకల తండ్రులు విడిపోతారు. తన కూతుర్ని రజినీ మురుగన్‌కు ఇచ్చి చస్తే పెళ్లి చేయనని కార్తీక తండ్రి నీలకంఠ(అచ్చుత్ కుమార్) శపథం చేస్తాడు. రజినీ పెద్దవాడైన తర్వాత కార్తీకను ప్రేమలో పడేయటానికి విశ్వప్రయత్నాలు మొదలుపెడతాడు. పనీ, పాటా లేకుండా తిరుగుతున్న రజినీపై నీలకంఠ కోపంగా ఉంటాడు. రజినీ వైపు చూడొద్దంటూ కార్తీకకు ఎల్లప్పుడూ హెచ్చరికలు జారీచేస్తుంటాడు. అయినప్పటికీ కార్తీక రజినీ ప్రేమలో పడుతుంది. కానీ, తండ్రి మీద గౌరవంతో ఆ విషయం రజినీకి చెప్పదు.
కానీ, రజినీ మాత్రం మిత్రుడు తోతాద్రి(సూరి) సహాయంతో తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. ఏదైనా బిజినెస్ చేసి డబ్బు సంపాదించి నీలకంఠ మెప్పు పొందాలని చూస్తుంటాడు. కానీ, డబ్బు సంపాదించటానికి అతడు చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతుంటాయి. ఇలాంటి సమయంలో రజినీ తాత ఓ సలహా ఇస్తాడు. ఇళ్లు అమ్మి వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయమంటాడు. అయితే ఇళ్లు అమ్మే ప్రయత్నంలో అతడికి ఎదురయ్యే అవాంతరాలేంటి? రజినీ ఇళ్లు అమ్మి బిజినెస్ స్టార్ట్ చేస్తాడా? కార్తీక తండ్రి వారి పెళ్లికి ఒప్పుకుంటాడా? లేదా? అన్నదే మిగితా కథ.
విశ్లేషణ : 2016లో విడుదలైన రజినీ మురుగన్ ఫుల్‌లెన్త్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. మధురై నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. దర్శకుడు పొన్‌రామ్, శివకార్తికేయన్, సూరి కాంబోలో వచ్చిన మరో ఫన్ ఫిల్లుడ్ మూవీ. శివకార్తికేయన్, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. కార్తీకను ప్రేమలో పడేయటానికి రజినీ చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ సినిమాకే హైలెట్ నిలుస్తుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment