జెమినీ గణేశన్ సురలి రాజన్
సినిమా : జెమినీ గణేశన్ సురలి రాజన్
తారగణం : అధర్వ, సూరీ, ఐశ్వర్య రాజేశ్, రెజీనా కసాండ్ర, ప్రణీత, అతిథి పహెంకర్
డైరక్టర్ : ఓడమ్ ఇలవరసు
భాష : తమిళ్
కథ : జెమినీ గణేశన్(అధర్వ)ను అతడి తండ్రి చిన్నప్పటినుంచి నటుడు జెమినీ గణేశన్‌కు సంబంధించిన విషయాలు చెప్పి పెంచుతాడు. దీంతో జెమినీ నిజంగానే కాదల్ మన్నన్‌లా మారతాడు. ప్రేమ తప్ప పెళ్లి అన్న పదం తన డిక్షనరీలో లేకుండా చేస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమలో దించేదాకా వదలడు. అలా అక్కా అంటూ లావణ్య(రెజీనా)ను, చెల్లీ అంటూ దేవి(అతిథి)ని ప్రేమలో దించుతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేసే సరికి ప్లాన్ ప్రకారం వారినుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఊటీలో ప్రియ(ప్రణీత)ను కూడా ప్లాన్ ప్రకారం ప్రేమలో పడేస్తాడు.
ఆమె కూడా పెళ్లి చేసుకోమనే సరికి ఆమె తండ్రి సహాయంతో తప్పించుకుంటాడు. అయితే అదే సమయంలో జెమినీ ప్రేమలో పడ్డ పూజ(ఐశ్వర్య రాజేశ్) అతడ్ని ప్రేమించమని కాకుండా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ప్రేమించటమే తప్ప పెళ్లి అంటే పడని జెమినీ, పూజను పెళ్లి చేసుకుంటాడా? ప్రియురాళ్లను వదిలించుకోవటానికి అతడు వేసిన ప్లాన్‌లు ఏంటి? చివరికి అతడిలో మార్పు వస్తుందా?లేదా? అన్నదే మిగితా కథ.
విశ్లేషణ : 2017 విడుదలైన ‘జెమినీ గణేశన్ సురలి రాజన్’ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. కాదల్ మన్నన్‌గా అధర్వ నటన మనల్ని ఆకట్టుకుంటుంది. జెమినీ పాత్ర నేటి సమాజంలోని చాలా మంది యువత జీవితాలకు అద్దం పడుతుంది. తొలి ప్రేమ తాలుకూ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేమనటానికి రెజీనా, అతిథి, ప్రణీతల పాత్రలు నిదర్శనంగా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో ఈ సినిమా ఏడిపిస్తూనే సడెన్‌గా నవ్వులు పూయిస్తుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment