శీను సినిమాలోని ఓ దృశ్యం
సినిమా : శీను
తారాగణం : వెంకటేష్, ట్వింకిల్ ఖన్నా
డైరక్టర్ : శశి
కథ : శీను(వెంకటేష్) పల్లెటూరికి చెందిన అమాయకమైన వ్యక్తి. పేయింటర్‌గా పనిచేయటానికి కొత్తగా హైదరాబాద్‌కు వస్తాడు. అమ్మాయిల వెంట పడినా అతడి పల్లెటూరి వేష భాషలు చూసి ఎవరూ పట్టించుకోరు. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి శ్వేత( ట్వింకిల్ ఖన్నా) అడుగుపెడుతుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల మూగవాడిగా ఆమె ముందు నటించాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్దిరోజులకే ఆమెతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతాడు. ఆమె తన మీద జాలి మాత్రమే చూపిస్తోందని భావించి తన ప్రేమను మనసులో దాచుకుంటాడు.
ఆమె తన మీద చూపిస్తున్నది జాలి కాదు ప్రేమ అని తెలిసిన మరుక్షణమే తను మూగవాడు కాదన్న సంగతి చెప్పాలను ప్రయత్నిస్తాడు. కానీ, కుదరదు. మూగవాడిగా నటించి ఆమెను మోసం చేయలేక నిత్యం నరకం అనుభవిస్తాడు. శీను తను మూగవాడు కాదన్న సంగతి శ్వేతకు చెబుతాడా? శీను విషయం తెలిసి శ్వేత ఎలా రియాక్ట్ అవుతుంది? నిజం తెలిసిన తర్వాత అతడిని ప్రేమిస్తుందా? లేదా? అన్నదే మిగితా కథ.
విశ్లేషణ : 1999లో విడుదలైన శీను ఫుల్ లెన్త్ రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రేమికులుగా వెంకటేష్, ట్వింకిల్ ఖన్నాల నటన మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రేమించిన అమ్మాయికి నిజం చెప్పలేక మదన పడే వ్యక్తిగా వెంకటేష్ నటన వేరే లెవల్‌లో ఉంటుంది. మణిశర్మ సంగీతం మనల్ని కట్టిపడేస్తుంది. ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
‘ నువ్వు ఓ జీవిని నిజంగా ప్రేమిస్తే! సీతాకోకచిలకలా దాన్ని స్వేచ్ఛగా వదిలేయ్. అది నిన్ను ప్రేమించటం నిజమైతే తప్పకుండా తిరిగొస్తుంది.’
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment