అచ్చంపేట: తెలుగు వారి పండగలలో సంక్రాంతి పండుగకు ప్రాధాన్యత ఉంది. సంప్రదాయం, సంస్కతికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. ఆరుకాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో ఈ పండగ రావడంతో గ్రామీణ ప్రాతంలోని రైతులు ఇళ్లలలో ఆనందం వెల్లు విరుస్తుంది. తెలుగు వారి లోగిళ్లలో రంగు రంగుల హరివిల్లు వెలసిన ముగ్గులు, వాటిపై పసుపు, కుంకుమతో గొబ్బిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ముగ్గుల్లో గరక పోచలు, రేగుపళ్లు, నవధాన్యాల మరో అలంకరణ. ఈ నేపథ్యంలో గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికే ప్రత్యేకమని చెప్పొచ్చు. అయ్య గారికి దండం పెట్టు.. అమ్మ గారికి దండం పెట్టు.. అంటూ చెప్పే యాజమాని సూచనలకు అనుగుణంగా తల ఊపే బసవన్నలు కొత్త వస్త్రాల అలంకరణలో ఆకట్టుకుంటాయి.
తగ్గిన ఆదరణ..
అచ్చంపేట పట్టణంలో 22 గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. వీరు పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామం నుంచి 25 ఏళ్ల క్రితం ఇక్కడి వచ్చి స్థిరపడ్డారు. ఇప్పటి ఈ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పటి వరకు పెద్ద చదువులు చదివిన వారు కూడా లేరు. పెళ్లిళ్ల సీజన్ హైదరాబాద్ నుంచి పిలుపు వస్తే వాయిద్యం వెళ్లడమే తప్ప మిగతా రోజుల్లో ఏ పనికీ వెళ్లారు. గ్రామాల్లో ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా వీరు గంగిరెద్దు సాయంతో ఉపాధి పొందుతున్నారు. ఊరూరా తిరిగి వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర, వంగూరు, చారకొండ, పెద్దకొత్తపల్లి మండలాల్లో నిత్యం పర్యటించి ఉదయం,రాత్రివేళ గంగిరేద్దు ఆటతో జీవనం సాగిస్తున్నారు. అయితే, దీనికి ఆదరణ తగ్గిందని పెద్ద సవారి, పెద్ద నర్సింహ, నిరంజన్ చెబుతున్నారు. రాత్రివేళ గతంలో గంగిరెద్దు ఆట చూసేందుకు బాగా వచ్చేవారని ఇప్పుడు పాతకాలం నాటి మనఘులు మాత్రమే వస్తున్నారని చెప్పారు. వ్యవసాయ కాలంలో కల్లాల వద్దకు వెళ్లితే గింజలు పెట్టేవారు కాగా, ఇప్పుడు ఐదో, పదో డబ్బు ఇస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment