ఆ తర్వాతే బికినీ ఫోటోలు పోస్ట్‌ చేస్తా : పాయల్‌ |  I will post bikini pics after workouts says Rajputpaayal | Sakshi
Sakshi News home page

ఆ తర్వాతే బికినీ ఫోటోలు పోస్ట్‌ చేస్తా : పాయల్‌

Published Thu, Jan 17 2019 10:47 AM | Last Updated on Thu, Jan 17 2019 4:42 PM

 I will post bikini pics after workouts says Rajputpaayal - Sakshi

అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ భామ సోషల్‌మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లు సరదాగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పాయల్‌ బదులిచ్చి తన ఇన్‌స్టామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు. మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్‌ చేయండి అంటూ ఓ నెటిజన్‌ అడిగి ప్రశ్నకు.. ఇప్పుడు కాదు. కొంత బరవు తగ్గడానికి వర్కవుట్స్‌ చేస్తున్నాను. శరీరం మంచి ఆకృతికి వచ్చిన తర్వాత బికినీ ఫోటోలు పోస్ట్‌ చేస్తా అంటూ బదులిచ్చారు. నెటిజన్లు అడిగిన మరిన్ని ప్రశ్నలకు పాయల్‌ సమాధానం ఇచ్చారు.

నెటిజన్‌ : ఆర్‌ఎక్స్‌ 100 సినిమా మీ తల్లిదండ్రులతో కలిసి చూశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి నుంచి ఏమైనా కంప్లైంట్‌లు వచ్చాయా?

పాయల్‌ రాజ్‌పుత్ : అవును, ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని మా అమ్మతో కలిసి చూశాను. చిత్రంలో హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాలను మా అమ్మతో కలిసి చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సినిమాలో భాగంగా నీ పని నువ్వు చేశావు, నువ్వు చేసే పనిలో ఇదంతా ఓ భాగమే కదా అంటూ అమ్మ నాకు అండగా నిలిచింది.

నెటిజన్‌ : కేజీఎఫ్‌ చిత్రాన్ని చూశారా?



పాయల్‌ రాజ్‌పుత్ : క్షమించండి ఇంకా చూడలేదు. తీరిక సమయం దొరకగానే ఖచ్చితంగా చూస్తా

నెటిజన్‌ : మీ అందమైన నవ్వు వెనకున్న రహస్యం ఏంటి ?
పాయల్‌ రాజ్‌పుత్ : ఆనందంగా బతకాలనుకుంటున్నా అంతే, ఏవరైతే ఆనందంగా ఉంటారో, మిగతావారిని కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు.

నెటిజన్‌ : మీ మొదటి ప్రాధాన్యత ఎవరికిస్తారు?
పాయల్‌ రాజ్‌పుత్ : ముందు కుటుంబం. ఆ తర్వత కేరీర్‌

నెటిజన్‌ : మీకు ఇష్టమైన ఆహారం ఏంటి?
పాయల్‌ రాజ్‌పుత్ : సాంబార్‌ రైస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement