
అక్షయ్‌కుమార్, సారా అలీఖాన్, ధనుష్
‘రాంఝనా’ సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ధనుష్. తనను హిందీకి పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మళ్లీ ‘అట్రంగీ రే’ అనే సినిమా చేయనున్నారు. ‘అట్రంగీ’ అంటే రంగు లేనిది అని అర్థం. ఇందులో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సారా అలీ ఖాన్ హీరోయిన్. ‘అట్రంగీ రే’ చిత్రాన్ని గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఓ ఎమోషనల్ లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. సినిమా పేరు రంగు లేనిది కానీ.. ఈ ప్రేమకథ మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందట. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment