విమర్శలను లైట్‌ తీస్కోవాలి- నటి | ​heroine kajal agarwal acts in queen tamil movie | Sakshi
Sakshi News home page

విమర్శలను లైట్‌ తీస్కోవాలి- నటి

Published Tue, Feb 6 2018 7:54 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

​heroine kajal agarwal acts in queen tamil movie - Sakshi

సాక్షి, చెన్నై: విమర్శలను లైట్‌ తీస్కోవాలని అంటోంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం కాజల్‌ హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్‌ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న నటిమణులో ఈ బ్యూటీ ఒకరు. ఇన్నేళ్ల నటజీవితం కాజల్‌కు చాలా అనుభవాన్ని ఇచ్చింది. చాలా విషయాలను గురించి ఎంతో పరిపక్వతతో చెప్పారు. అవేమిటో చూద్దాం.. ‘జీవితంలో ప్రతి వారికి కల అనేది ఉండాలి. దాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమించాలి.

నటి నవ్వడం నా కల..
నేను చిన్న తనం నుంచి నటినవ్వాలని కలలు కన్నాను. శక్తి వంచన లేకుండ శ్రమించాను. కృషి, శ్రమ పట్టుదల ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఒక్కోసారి హీరోహీరోయిన్లు ఎంతో నమ్మకం పెట్టుకున్న చిత్రాలు నిరాశపరచవచ్చు. అందుకు కారణాలు తెలియవు. చిత్రాల జయాపజయాలు మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు నిరాశచెందకూడదు. అందులోంచి బయటపడి, ముందడుగు వేస్తే మళ్లీ విజయాలబాట పట్టగలం.

ఫలితాలను విధి నిర్ణయిస్తుంది..
చేసే వృత్తి మనకు ముఖ్యంగా భావించాలి. ఫలితాలను విధి నిర్ణయిస్తుంది. లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించాలి. మనకు సలహాలివ్వడానికి చాలా మంది వస్తుంటారు. అలాంటివన్నీ తీసుకోవాలి. అయితే నిర్ణయాలు మాత్రం మనవే అయ్యిఉండాలి. కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు లేకుంటే మనం ఏం చేయలేం. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా అనుబంధాలకు ప్రాముఖ్యతనివ్వాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో విమర్శలను లైట్‌ తీస్కోవాలి’ అని నటి కాజల్‌ అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement