ఆరు నెలల్లో సాహో షూటింగ్ పూర్తి | 180 Days Shoot left for Prabhas Sahoo | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో సాహో షూటింగ్ పూర్తి

Published Thu, Aug 10 2017 4:14 PM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

ఆరు నెలల్లో సాహో షూటింగ్ పూర్తి - Sakshi

ఆరు నెలల్లో సాహో షూటింగ్ పూర్తి

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు తగ్గట్టుగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు ప్రభాస్. షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రభాస్ లేకుండానే 7 రోజుల షూటింగ్ పూర్తి చేసింది.

తాజాగా సాహో సినిమాటోగ్రాఫర్ మది తమిళ మీడియాతో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాహుబలి సినిమా కోసం మూడేళ్లకు పైగా పని చేసిన ప్రభాస్, సాహో సినిమాను మాత్రం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయనున్నాడట. ఈ సినిమాకు సంబంధించి మరో 180 రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే మిగిలుందని వెల్లడించారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భాగం ఎక్కువన్న మది పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయం పట్టే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. త్వరలోనే హీరోయిన్ ఎవరన్నది దర్శక నిర్మాతలు ఎనౌన్స్ చేస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement