ఆరు భాషల్లో ఆర్త్తీ అగర్వాల్ సినిమా! | 6 languages act in arti agarwal movie | Sakshi
Sakshi News home page

ఆరు భాషల్లో ఆర్త్తీ అగర్వాల్ సినిమా!

Published Tue, Sep 9 2014 2:01 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

ఆరు భాషల్లో ఆర్త్తీ అగర్వాల్ సినిమా! - Sakshi

ఆరు భాషల్లో ఆర్త్తీ అగర్వాల్ సినిమా!

కథానాయికగా ఆర్తీ అగర్వాల్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. అయితే... ఆ తర్వాత్తర్వాత ఆమె కాస్త వెనకబడ్డారు. ప్రస్తుతం ఏకంగా ఆరు భాషల్లో రూపొందుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారామె. భరత్ పారేపల్లి దర్శకత్వంలో టైమ్ మీడియా కమ్యూనికేషన్స్ సమర్పణలో ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.ఎ. రహమాన్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్తీ అగర్వాల్, ముకుల్ దేవ్, పోసాని, హర్షవర్థన్, ఆదిత్య ఓం ముఖ్య తారలుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం రూపొందడం విశేషం.

చిత్రవిశేషాలను దర్శకుడు తెలియజేస్తూ -‘‘ఇప్పటివరకు దర్శకునిగా నేను 30 చిత్రాలు చేశాను. కానీ, ఇప్పుడు చేస్తున్నది భారీ చిత్రం. ఇన్నోసెంట్ గాళ్ పాత్రకు ఆర్తి అయితేనే బాగుంటుందని తనను అమెరికా నుంచి పిలిపించి, నటింపచేశాం. ఒక ప్రత్యేక పాట మినహా సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రత్యేక పాటను ముంబయ్‌లో చిత్రీకరించనున్నాం. వచ్చే నెల 21న ముంబయ్‌లో ఆడియో వేడుక చేసి, నవంబర్ 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్‌లో భారీ చిత్రాలు నిర్మించిన తమ సంస్థ ఈ చిత్రం ద్వారా దక్షిణాది భాషల్లోకి ప్రవేశించడం ఆనందంగా ఉందని టైమ్ మీడియా కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాహుల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement