శివకార్తికేయన్‌లా నేనూ ఏడవాలా? | A scene in the film accanyanbadu madamaiyada | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌లా నేనూ ఏడవాలా?

Published Fri, Nov 11 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

శివకార్తికేయన్‌లా నేనూ ఏడవాలా?

శివకార్తికేయన్‌లా నేనూ ఏడవాలా?

అచ్చం యన్బదు మడమైయడా చిత్రంలో ఓ దృశ్యం
నటుడు శివకార్తికేయన్‌లా తానూ ఏడవాలా? అని పత్రికలవారితో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ పేర్కొన్నారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం అచ్చంయన్బదు మడమైయడా. శింబు, మంజిమామోహన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘సాహసమే శ్వాసగా సాగిపో’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించారు. ఈ చిత్రం రెండు భాషల్లోనూ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర విడుదల ఆలస్యానికి కారణం ఏమిటన్న విలేకరి ప్రశ్నకు చిత్ర షూటింగ్‌లో ఆలస్యం అయిన విషయం తనకు తెలుసని, అయితే అందుకు కారణం ఏమిటన్నది మాత్రం తెలియదని అన్నారు.

ఇందుకు నటుడు శివకార్తికేయన్ ఒక వేదికపై ఏడ్చినట్లు తనని ఏడ్వమంటారా? అని ప్రశ్నించారు. నటుడు శింబు తొమ్మిది గంటలకు కాల్‌షీట్ అయితే మధ్యాహ్నం రెండు గంటలకు లొకేషన్‌కు వచ్చే వారని, అయినా సంతోషంగా షూటింగ్‌లో పాల్గొనేవారని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబుకు గౌతమ్ మీనన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో శింబుతో మళ్లీ చిత్రం చేస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా చేస్తానని, అయితే శింబు నటించే చిత్రానికి తాను నిర్మాతగా ఉంటానని అన్నారు. అచ్చంయన్బదు మడమైయడా చిత్రం జనరంజకంగా వచ్చిందని గౌతమ్ మీనన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement