బుల్లితెర పైకి...ఘంటసాల జీవితం | A telefilm on life of Ghantasala | Sakshi
Sakshi News home page

బుల్లితెర పైకి...ఘంటసాల జీవితం

Published Wed, Dec 3 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

A telefilm on life of Ghantasala

అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది. 555 పాటలతో 828 పేజీలతో ‘ఘంటసాల పాటశాల’ అనే అపురూప గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించిన ఘంటసాల వీరాభిమాని సీహెచ్ రామారావు ఏడాది పాటు శ్రమించి, పరిశోధించి రాసిన ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఆధారంగా ఈ టెలీఫిలిమ్ రూపొందనుంది. పలు టెలీఫిలిమ్స్, డాక్యుమెంటరీలు రూపొందించి నంది అవార్డులు గెలుచుకున్న కర్రి బాలాజీ దర్శకుడు. ‘సుందరకాండ’, ‘కొండపల్లి రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసిన సీనియర్ నిర్మాత కేవీవీ సత్యనారాయణ సమర్పణలో వేణు ఈ టెలీ ఫిలిమ్ నిర్మించనున్నారు.
 
 దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ,‘‘ఘంటసాల జన్మస్థలం చౌటుపల్లి, సంగీతాభ్యాసం చేసిన విజయనగరం, గాయకునిగా వర్ధిల్లిన చెన్నై తదితర ప్రదేశాలన్నీ తిరిగి పరిశీలించి, పరిశోధించి సీహెచ్ రామారావు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. భవిష్యత్తులో ఈ స్క్రిప్టుతో పూర్తి నిడివి సినిమా చేసే ఆలోచన ఉంది. ఘంటసాల జయంతి రోజైన డిసెంబర్ 4న చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఘంటసాల పాత్రను ఓ ప్రముఖ రంగస్థల నటుడు పోషించనున్నారు. ఇతర తారాగణం ఎంపిక పూర్తయింది. 45 నిమిషాల నిడివితో ఈ టెలీఫిలిమ్ ఘంటసాల వర్ధంతైన ఫిబ్రవరి 11న ప్రసారమవుతుంది’’ అని తెలిపారు. ఈ టెలీ ఫిలిమ్‌కు సహ నిర్మాత: బండ్ల బ్రహ్మస్వామి, కెమేరా: పీజీ విందా, ఎడిటింగ్: గౌతంరాజు, సంగీతం: మహిత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement