ఆమిర్ ఖాన్ కు మరో షాక్ | Aamir Khan loses Snapdeal contract | Sakshi
Sakshi News home page

ఆమిర్ ఖాన్ కు మరో షాక్

Published Fri, Feb 5 2016 7:08 PM | Last Updated on Mon, Oct 22 2018 5:17 PM

ఆమిర్ ఖాన్ కు మరో షాక్ - Sakshi

ఆమిర్ ఖాన్ కు మరో షాక్

న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందని ఇటీవల వ్యాఖ్యానించిన బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఆమిర్.. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ తో ఒప్పందాన్ని చేజార్చుకున్నాడు.

ప్రస్తుతం స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమిర్ తో కాంట్రాక్టును మళ్లీ పొడగించరాదని ఆ సంస్థ నిర్ణయించినట్టు సమాచారం. స్నాప్ డీల్ తో ఆమిర్ కాంట్రాక్టు జనవరి 31తో ముగిసింది. అయితే ఈ కాంట్రాక్టును రెన్యువల్ చేయలేదు. కాగా ఈ విషయంపై స్నాప్ డీల్ ప్రతినిధులు కానీ ఆమిర్ కానీ స్పందించలేదు. మూడు నెలల క్రితం దేశంలో మత అసహనం పెరిగిపోతోందని, దేశం విడిచిపొదామని తన భార్య కిరణ్ రావు కోరిందని ఆమిర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమిర్ వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్నాప్ డీల్ ఆప్ ను తొలగించి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆమిర్ తో కాంట్రాక్టును స్నాప్ డీల్ పునరుద్ధరించకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement