యాక్షన్ ఎంటర్‌టైనర్ | Action Entertainer | Sakshi
Sakshi News home page

యాక్షన్ ఎంటర్‌టైనర్

Published Sun, Nov 15 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

యాక్షన్ ఎంటర్‌టైనర్

యాక్షన్ ఎంటర్‌టైనర్

భోజ్‌పురిలో ఘనవిజయం సాధించిన ‘ఆజ్ కే కరణ్ అర్జున్’ చిత్రం ‘నేటి విజేతలు’గా తెలుగులోకి అనువాదమైంది. శ్రీమతి సరిత తిరువీధుల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.కే తెలుగులోకి విడుదల చేయనున్నారు. సుధాకర్ తిరువీధుల సహ నిర్మాత.  పాకీ హెగ్డే, క్రిషా ఖండేల్కర్ నాయికలుగా నటించారు. ఆర్.కే మాట్లాడుతూ - ‘‘ఇందులో భోజ్‌పురి సూపర్ స్టార్స్ దినేష్ లాల్, ప్రవేష్ లాల్ హీరోలుగా నటించారు. హీరోలిద్దరూ విలన్‌పై ఎలా పగ తీర్చుకున్నారు అనేది కథ? అద్భుతమైన పోరాటాలు, రెండు ప్రత్యేక పాటలు, కామెడీతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో పాటలను, ఈ నెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement