Dinesh Lal
-
యాదవ్ VS యాదవ్
ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగుకు సిద్ధపడుతుండటంతో బీజేపీ, గట్బంధన్ (ఎస్పీ, బీఎస్పీ కూటమి)లు తమతమ ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి విపక్షాల ఓటు బ్యాంకును కొల్లగొట్టడంతో సఫలీకృతురాలయ్యారు. అదే వ్యూహాన్ని ఈ సారి ఇరు పక్షాలు అమలు పరుస్తున్నాయి. ఈసారి బీజేపీ ఎస్పీకి చెందిన యాదవులు, బీఎస్పీకి చెందిన జాటవుల ఓట్లను ఏ మేరకు లాక్కోగలదన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు రెండూ కులం ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీలు. ఆయా సామాజిక వర్గాల గట్టి మద్దతుతో రాష్ట్రంలో ఇవి రెండూ బలంగా వేళ్లూనుకున్నాయి. 2002లో మాయావతి బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత కాలానికే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాను అధికారంలోకి రావడం కోసం బీఎస్పీని చీల్చారు. దీని వెనుక అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉందన్న వార్తలు వినిపించాయి. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగేనాటికి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మాయావతి సరికొత్త రాజకీయ సమీకరణకు శ్రీకారం చుట్టారు. గెలుపోటములను సామాజిక వర్గాలు ప్రభావితం చేసే కొన్ని నియోజకవర్గాల్లో మాయావతి విపక్షానికి చెందిన యాదవ నేతలను తమ పార్టీ తరఫున ఆ నియోజకవర్గాల్లో బరిలో దింపారు. లక్నో వీఐపీ గెస్ట్‌హౌస్‌లో మాయావతిపై దాడి కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రమాకాంత్ యాదవ్, ఉమాకాంత్ యాదవ్‌లకు ఆజంగఢ్, మచిలీషెహర్ టికెట్లు ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేత బాల్‌చంద్ర యాదవ్‌ను ఖలీలాబాద్ నుంచి, మిత్రసేన్ యాదవ్‌ను ఫైజాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపారు. మాయావతి చేసిన ఈ ప్రయోగం ఫలిం చింది. బీఎస్పీ ఓట్లను యాదవ అభ్యర్ధులకు మళ్లించగల సత్తా తనకుందని మాయావతి నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గాలన్నింటిలో ఎస్పీతో జరిగిన ముఖాముఖి పోటీలే మాయావతి అభ్యర్ధులంతా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది మంది యాదవ ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టారు. వీరిలో నలుగురు బీఎస్పీ టికెట్‌పై గెలిస్తే, ఐదుగురు ఎస్పీ తరఫున విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఎస్పీ నేతలు ఐదుగురిలో ములాయం, అఖిలేశ్‌లు ఉన్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా తాజా ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జత కట్టి బీజేపీపై పోరుకు దిగాయి. ఈ కూటమి దాదాపు డజను మంది యాదవ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఎస్పీకి చెందిన యాదవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తున్న బీజేపీ కేవలం ఒకే ఒక యాదవుడికి (భోజ్‌పురి గాయకుడు దినేశ్ లాల్ యాదవ్)టికెట్ ఇచ్చింది. ఈయనను ఆజంగఢ్‌లో అఖిలేశ్‌పై పోటీకి దించింది. ఈ సారి కాంగ్రెస్ కూడా ఇద్దరు యాదవ నేతలకు–బాలచంద్ర యాదవ్, రమాకాంత్ యాదవ్– టికెట్లు ఇచ్చింది. వీరు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీఎస్పీ. ఇక్కడ మాయావతి ఇద్దరు బ్రాహ్మణ నేతలను రంగంలో దించింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి దక్కిన ఈ సీట్లలో తమ ఓట్లను బీఎస్పీకి మళ్లించడం సమాజ్‌వాదీ పార్టీకి సవాలేనని పరిశీలకులు చెబుతున్నారు. -
ఎస్పీ మొనగాడితో పాటగాడు పోటీ
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఒకరు రాజకీయ నాయకుడు.. మరొకరు జానపద గాయకుడు.. ఇద్దరూ తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులే.. భిన్న రంగాలకు చెందిన వీరిద్దరూ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఆ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయితే, మరొకరు జానపద గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్. తూర్పు యూపీలోని అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తోంటే, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్‌లాల్ బరిలో దిగారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ’గా సుప్రసిద్ధుడు. ఘాజీపూర్‌లోని తాండ్వా గ్రామవాసి అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ సతల్ రహే’ ఆల్బమ్‌తో అశేష భోజ్పురీల మనసు దోచుకున్నాడు. గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న దినేశ్ గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు అజంగఢ్ టికెట్ ఇచ్చేసింది బీజేపీ. నియోజకవర్గంలో ఓ వర్గం ఓటర్లను దినేశ్‌లాల్ ఆకట్టుకోగలరన్న నమ్మకంతోనే ఆయనకు టికెట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బాహుబలి.. వీర యోధ మహాబలి
బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను, రికార్డులను ‘బాహుబలి’ ఏ లెవెల్లో కొల్లగొట్టిందో సినీ లోకమంతా చూసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తొలుత రిలీజ్ చేసిన ఈ సినిమాను కొన్ని భాషల్లోకి డబ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టోటల్‌గా మన టాలీవుడ్ సత్తా ఏంటో ‘బాహుబలి’ వరల్డ్ వైడ్‌గా చాటింది. ఈ నెల 29న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేస్తున్నారు కానీ, వేరే భాషలవాళ్లు రీమేక్ చేసే సాహసం అయితే చేయలేదు. మరి.. ఐదేళ్లంటే మాటలా? పైగా మరో రాజమౌళి ఉండాలి కదా? ప్రభాస్, రానా, రమ్యకృష్ణ.. ఇలా ఏ ఆర్టిస్ట్‌ని తీసుకున్నా వేరే భాషల్లో ఇలాంటి ‘గుడ్ ప్యాకేజ్’ సెట్ అవుతుందా? అంటే.. భోజ్‌పురి వాళ్లు సెట్ చేసుకున్నారని సమాచారం. యస్.. ‘బాహుబలి’ చిత్రం భోజ్‌పురిలో రీమేక్ అవుతోందని టాక్. అందుకు తగ్గట్టే.. కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. సో.. నమ్మక తప్పదు. దినేష్ లాల్ యాదవ్ నిర్హూస్ హీరోగా దర్శకుడు ఇక్బాల్ భ„Š ‘వీర్ యోధ మహాబలి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది ‘బాహుబలి’కి రీమేక్ అనేది భోగట్టా. ‘‘షూటింగ్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ వీర్ యోధ మహాబలి’’ అంటూ నిర్హూస్ ఫేస్బుక్లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అవి అచ్చం... ‘బాహుబలి’లో మన ప్రభాస్ గెటప్ పోలినట్లే ఉన్నాయి. అయితే... ఇది ‘బాహుబలి’కి రీమేక్ అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక, ఈ చిత్రకథానాయకుడు విషయానికొస్తే.. దినేష్‌లాల్ యాదవ్ భోజ్‌పురి ఇండస్ట్రీలో సింగర్, తర్వాత యాక్టర్‌గా మారాడు. టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా వర్క్ చేశాడు. 2012 బిగ్ బాస్ 6 కంటెస్ట్ కూడా. ప్రజెంట్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ‘నిర్హాహ్ హిందూస్థానీ, పాట్నానే పాకిస్తాన్’ వంటి భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. వాటిని హిందీలోనూ విడుదల చేశారు. ఈ సంగతలా ఉంచితే.. మన ‘బాహుబలి’ సాధించిన తాజా రికార్డ్ గురించి చెప్పుకుందాం. ఐఎమ్డిబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది ఇండియన్ టాప్ 10 మూవీస్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ‘బాహుబలి 2’ సినిమా సెంకడ్ ప్లేస్‌లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్‌ను మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ ఆక్రమించడం విశేషం. అర్జున్‌రెడ్డి, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియమ్, ఘాజి సినిమాలు 3,4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. తొలి టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో ఐదు సినిమాలు ఉండటం విశేషం. -
యాక్షన్ ఎంటర్టైనర్
భోజ్‌పురిలో ఘనవిజయం సాధించిన ‘ఆజ్ కే కరణ్ అర్జున్’ చిత్రం ‘నేటి విజేతలు’గా తెలుగులోకి అనువాదమైంది. శ్రీమతి సరిత తిరువీధుల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.కే తెలుగులోకి విడుదల చేయనున్నారు. సుధాకర్ తిరువీధుల సహ నిర్మాత. పాకీ హెగ్డే, క్రిషా ఖండేల్కర్ నాయికలుగా నటించారు. ఆర్.కే మాట్లాడుతూ - ‘‘ఇందులో భోజ్‌పురి సూపర్ స్టార్స్ దినేష్ లాల్, ప్రవేష్ లాల్ హీరోలుగా నటించారు. హీరోలిద్దరూ విలన్‌పై ఎలా పగ తీర్చుకున్నారు అనేది కథ? అద్భుతమైన పోరాటాలు, రెండు ప్రత్యేక పాటలు, కామెడీతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో పాటలను, ఈ నెల చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.