‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు.. మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది. పెద్దదే కాదు.. కష్టమైంది కూడా’’ అంటూ ‘భరత్ అనే నేను’ ట్రైలర్‌లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగులు సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచాయి.
మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. డి. పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు.
Comments
Please login to add a commentAdd a comment