జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను! | Actor Abhishek Bachchan Responds To Meme Made On Him | Sakshi
Sakshi News home page

జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను!

Published Wed, Oct 23 2019 4:48 PM | Last Updated on Wed, Oct 23 2019 5:07 PM

Actor Abhishek Bachchan Responds To Meme Made On Him - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు, మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్యర్యరాయ్‌ భర్త అభిషేక్‌ బచ్చన్‌.. నిజానికి బిగ్‌ బీ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిషేక్‌ హిట్‌ కాలేకపోయారు. ఎన్ని సినిమాలు తీసినా ఆయనకు సరైన విజయం దక్కలేదు. హిరోగా నిలదొక్కుకోలేకపోయారు. సైడ్‌ హీరో క్యారెక్టర్లు వేసినా.. మంచి పేరైతే రాలేదు. ఈ నేపథ్యంలో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ మధ్య చాలావరకు జూనియర్‌ బచ్చన్‌ సినిమాల్లో కనిపించలేదు.

ఇక, సోషల్‌ మీడియా జూనియర్‌ బచ్చన్‌ మీద అప్పుడప్పుడు జోకులు పేలుతూనే ఉంటాయి. తన మీద వచ్చే కూల్‌ జోక్స్‌ మీద అభిషేక్‌ కూడా హుందాగా స్పందిస్తూ ఉంటారు. త్వరలో విడుదల కానున్న ‘మర్జావాన్‌’ సినిమా ట్రైలర్‌లోని ఓ వ్యక్తి  జూనియర్‌ బచ్చన్‌ను పోలి ఉండటంతో.. చాలాకాలం తర్వాత సినిమాల్లో అభిషేక్‌ను చూడటం ఆనందంగా ఉందంటూ ఓ నెటిజన్‌ మీమ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ మీమ్‌పై అభిషేక్‌ సరదాగా స్పందిస్తూ.. ‘థాంక్యూ.. జిమ్‌లో పొద్దస్తమానం కష్టపడి ఈ కండలు సాధించాను...ఇక జోక్స్‌ పక్కనబెడితే.. అది నేను కాదు. ‘మర్జావాన్‌’ చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ స్పందించారు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సిద్ధార్థ మల్హోత్రా, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మిలాప్‌ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన మర్జావాన్‌ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement