డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నటుడు అరెస్ట్ | Actor Arun Vijay arrested for drunk and drive case Car Accident | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నటుడు అరెస్ట్

Published Sun, Aug 28 2016 2:33 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నటుడు అరెస్ట్ - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నటుడు అరెస్ట్

తమిళసినిమా: డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్‌లో నటుడు అరుణ్ విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన నటుడు అరుణ్‌విజయ్. ఈయన సీనియర్ నటుడు విజయకుమార్ కొడుకు అన్న విషయం తెలిసిందే.  శుక్రవారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలో గల ఒక నక్షత్ర హోటల్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరైన అరుణ్‌విజయ్ అర్ధరాత్రి వరకూ అక్కడ గడిపి వేకువ జామున 3.40 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి తిరిగి పయనం అయ్యారు. కాగా బాగా మద్యం తాగి ఉన్న ఆయన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం.
 
  దీంతో నుంగంబాక్కం పోలీసులు అరుణ్ విజయ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో సమాచారం అందిన అరుణ్ విజయ్ తండ్రి విజయకుమార్ వెంటనే నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం స్థానిక పాండిబజార్ ట్రాఫిక్ పోలీస్ అధికారులను కలిసి సొంత పూచీకత్తుపై బెయిల్‌తో అరుణ్ విజయ్‌ను విడిపించి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే పాండిబజార్ ట్రాఫిక్ విభాగం పోలీస్‌అధికారులు అరుణ్‌విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement