ముంబై: హిందీ టీవీ నటుడు శివిన్ నారంగ్ గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో అతడిని అంధేరిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారని... లాక్‌డౌన్ కారణంగా శివిన్ తల్లిదండ్రులను కూడా లోపలికి అనుమతించలేదని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ విషయం గురించి వారు మాట్లాడుతూ.. ‘‘శివిన్ దురదృష్టవశాత్తూ తన ఇంట్లో జారిపడ్డాడు. గాజు గ్లాసుపై పడటంతో ఎడమ చేతికి రక్తస్రావం అయ్యింది. చాలా రక్తం పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు’’ అని తెలిపారు.(అనుకోకుండా ఇన్‌స్టా లైవ్.. హీరోయిన్ తంటాలు)
ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంతవరకు అతడిని నేరుగా చూసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బేహద్ 2 సీరియల్‌లో నటిస్తున్న శివిన్ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. రోహిత్ శెట్టి హోస్ట్ చేసిన ఖత్రోంకీ కిలాడీ 10 షోలో కూడా అతడు పాల్గొన్నాడు. గతంలో సీరియల్ షూటింగ్ సమయంలో అతడు గాయపడ్డాడు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సినిమా, సీరియల్ షూటింగ్‌లు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు ఉల్లాసంగా గడుపుతూ.. తమకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.(కరోనా వైరస్: తెలుగులో పూజా చిట్కాలు )
Comments
Please login to add a commentAdd a comment