
త్వరలో రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ నటుడు సిద్ధార్థ్ స్పందించారు. రాజకీయ నాయకుడిని కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. తనలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండలేరని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా విషయాలు తెలిసి ఉండడంతోపాటు, ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలన్న విషయం కూడా తెలిసి ఉండాలన్నారు. సరైన సమయంలో సరైన విషయాన్ని ప్రస్తావించడం తెలియాలన్నారు.
సమాజంలో ఎదురయ్యే సమస్యల, జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వాణిని వినిపిస్తుంటారు సిద్ధార్థ్. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తన అభిప్రాయాలు మాత్రమేనని, అంతకుమించి మరేమీ లేదని స్పష్టం చేశాడు. తనకు నిజం మాట్లాడడం మాత్రమే తెలుసని సిద్ధార్థ్ అన్నాడు. సమస్యలపై స్పందించకపోతే తప్పు చేసినట్టుగానే భావిస్తానని సిద్ధార్థ చెప్పుకొచ్చాడు. కాగా.. సిద్ధార్థ్ చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలకు తెరపడినట్టేనని భావించొచ్చు. ప్రస్తుతం ఆయన టక్కర్ సినిమాలో విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment