ఆ ఇద్దరూ ఎవరు? | Actor Surya's Upcoming Movie 24 Teaser Released in youtube | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ ఎవరు?

Published Sat, Mar 5 2016 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

ఆ ఇద్దరూ ఎవరు?

ఆ ఇద్దరూ ఎవరు?

 ఆ ఇద్దరూ పంచుకున్నది ఒకే గర్భం... క్షణాల తేడాలో జననం.. ఒకటే రూపం. కానీ, స్వభావాలు వేరు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానమే ‘24’. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్‌లో సంచ లనం రేపుతోంది.  ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శత్వంలో సూర్య, సమంత, నిత్యామీనన్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘24’.  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సరికొత్త కథాకథనాలతో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రఫీ: తిరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement