గొప్ప నటులందరూ దర్శకులు తీర్చిదిద్దినవారే
ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న వారందరూ దర్శకుల చేత మలచబడ్డవారేనని ప్రముఖ దర్శకుడు పి.వాసు వ్యాఖానించారు. ఆయన వారసుడు శక్తివేల్ వాసు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 7 నాట్కళ్. మిలియన్ డాలర్ మూవీస్ పతాకంపై కార్తీక్, కార్తీకేయన్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నికీషాపటేల్,అంగనారాయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఆ చిత్రం ద్వారా నవ దర్శకుడు గౌతమ్ పరిచయం అవుతున్నారు.
ఈయన దర్శకుడు సుందర్.సి వద్ద సహాయదర్శకుడిగా పనిచేశరన్నది గమనార్హం. అంతే కాదు ఒక షార్ట్ ఫిలిం తీసిన అనుభవం ఉంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం స్థానిక సాలిగ్రామంలో గల ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ ఈ 7 నాట్కళ్ చిత్ర కథను తాను విన్నానని చెప్పారు. కథ చాలా బాగుంది. జనరంజకమైన అంశాలన్నీ చోటు చేసుకున్నాయని దీన్ని దర్శకుడు, నిర్మాతలు ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా రూపొందించాలని కోరారు.
ఈ తరం సహాయ దర్శకులు షార్ట్ ఫిలింస్ తీసి తమ సత్తాను చాటుకుని దర్శకులతో తమ ప్రతిభ మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అంటున్నారన్నారు. తమ కాలంలో ఇలాంటి పరిస్థితిలేదన్నారు.తాను దర్శకుడు శ్రీధర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరిన ఆరు నెలల తరువాత కూడా నువ్వు ఎవరివి అని ప్రశ్నించారని అన్నారు. అప్పట్లో ఆయన తనను పేరు పెట్టి పిలవడం చాలా అరుదని తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న వారందరూ దర్శకుల చేత మలచబడిన వారేనని పేర్కొన్నారు.
నటుడ శక్తివేల్‌కు అలా మంచి నటుడనే సయమం ఆసన్నమైందని అన్నారు. తానిప్పుడు శక్తివేల్ నటిస్తున్న కథలను వినడం లేదన్నారు. అయితే అతనితో చిత్రాలు చేస్తున్న నిర్మాతల గురించి తెలుసుకుంటానని అన్నారు.7 నాట్కళ్ మంచి చిత్రంగా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు గౌతమ్ కథను నెరేట్ చేసిన విధం తనను విపరీతంగా ఆకట్టుకుందని, అందువల్లే ఈ 7నాట్కళ్ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు కథానాయకుడు శక్తివేల్ వాసు పేర్కొన్నారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం ఎంఎస్.ప్రభు,సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.