చూడు... రెండో వైపు చూడు! | Kajal Aggarwal is the latest to join the lady oriented cinema list. | Sakshi
Sakshi News home page

చూడు... రెండో వైపు చూడు!

Published Tue, Jul 18 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

చూడు... రెండో వైపు చూడు!

చూడు... రెండో వైపు చూడు!

అనుష్క.. నయనతార.. త్రిష.. తమన్నా.. అంజలి.. పూర్ణ.. ఏంటీ? వీళ్లందరూ కలసి ఒక సినిమాలో యాక్ట్‌ చేయబోతున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఒకవైపు గ్లామరస్‌ రోల్స్‌ చేయడంతో పాటు వీళ్లంతా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ తమ సత్తా చాటారు. ఈ లిస్టులోకి తాజాగా కాజల్‌ అగర్వాల్‌ చేరారని చెన్నై టాక్‌.

‘చంద్రముఖి’ ఫేమ్‌ పి. వాసు తమిళ, తెలుగు భాషల్లో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు కాజల్‌ అగర్వాల్‌ అయితే బాగుంటుందనుకున్నారట. కాజల్‌ను కలిసి కథ వినిపించారని కోలీవుడ్‌ సమాచారం. లేడీ ఓరియంటెడ్‌ మూవీ, అది కూడా వాసులాంటి సీనియర్‌ డైరెక్టర్‌.. మరి కాజల్‌ కాదంటారా? గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని భోగట్టా. ఈ బ్యూటీ కథానాయిక అయి పదేళ్లకు పైనే అయింది. ఇన్నేళ్లూ ఒకవైపు చూశాం.. ఇప్పుడు కథానాయికగా రెండో వైపు చూడనున్నాం అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement