జయంరవితో బాగుంటుంది! | actress hansika interview | Sakshi
Sakshi News home page

జయంరవితో బాగుంటుంది!

Published Sun, Mar 12 2017 3:53 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

జయంరవితో బాగుంటుంది! - Sakshi

జయంరవితో బాగుంటుంది!

నటుడు జయంరవితో నటిస్తున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందంటోంది నటి హన్సిక. దర్శకుల నటి, సక్సెస్‌ఫుల్‌ నటిలాంటి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటించిన చిత్రాలు గత ఏడాది నాలుగు తెరపైకి వచ్చాయి. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేకపోవడం విశేషమే. ఇటీవల విడుదలైన బోగన్‌ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది అయినా అవకాశాలు లేవు. ఏంటీ హన్సిక పనైపోయిందా?ఇక దుకాణం బందేనా? లాంటి చర్చ జరుగుతోంది.ఇత్యాధి విషయాల గురించి హన్సిక ఏం చెబుతుందో చూద్దాం..

ఏమిటి పరిస్థితి ఇలాగైందీ? చేతిలో ఒక్క చిత్రం కూడా లేదేం?
నేను 2007 నుంచి కథానాయకిగా నటిస్తున్నాను.ఏడాదికి నాలుగైదు చిత్రాలు నటిస్తూ వచ్చాను. నేను టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది 2012లోనే. నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీనే ప్రధా నం. ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను.అందులో కొన్ని కథలను ఓకే చేశాను.సెలెక్టెడ్‌ చిత్రాలే చేస్తాను.

విశాల్, శింబు, ధనుష్, జయంరవి, శివకార్తికేయన్‌ లాంటి ప్రముఖ హీరోలతో నటించిన మీరు ఇప్పుడు వర్దమాన నటులతో కూడా నటించడానికి సిద్ధం అంటున్నారటగా?
జ: స్టార్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తానని నేనేప్పుడూ చెప్పలేదే. మాన్‌కరాటే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో శివకార్తీకేయన్‌ అప్పుడే ఎదుగుతున్న నటుడు. చిన్న నటుడు,పెద్ద నటుడు అన్న భేదాభిప్రాయాన్ని నేనెప్పుడూ వ్యక్తం చేయలేదు.

జయంరవికి జంటగా నటిస్తున్నప్పుడు మాత్రమే చాలా సన్నిహితంగా నటిస్తారనే ప్రచారంపై మీ స్పందన?
అవునా? ఇలాంటి ప్రచారం ఎవరు చేస్తున్నారోగానీ, రవితో నేనిప్పటికి మూడు చిత్రాలు చేశాను. నేను జయంరవికి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను.ఆయన భార్య ఆర్తి నాకు మంచి స్నేహితురాలు. వారిద్దరూ నా వెల్‌విషర్స్‌. జయంరవితో కలిసి నటిస్తున్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాను.ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో పాజిటీవ్‌ ఎనర్జీతో ఉంటారు. సినిమాల్లో మేము కంఫర్టబుల్‌ జంటగా కనిపించడం వల్లే మీరు అన్నట్లు కొందరు భావిస్తున్నారేమో.

నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంటున్నారు.అయినా చెక్కు చెదరని అందం.ఎలా మెయింటైన్‌ చేయగలుగుతున్నారు?
మీ ప్రశ్నకు నాకు వయసైపోయిందేమోనన్న భయం కలుగుతోంది. నా వయసెంతనుకుంటున్నారు? నేను 16 ఏటనే నటిగా రంగప్రవేశం చేశాను.ఈ ఏడాది ఆగస్ట్‌ నెల వస్తే 26 ఏళ్లు వస్తాయి.ఇకపోతే నాకు ఆహారపు నియమాలంటే పెద్దగా ఏమీ ఉండవు. నచ్చిన ఆహారం అయితే పుల్‌గా లాగించేస్తా. మనసును సంతోషంగా ఉంచుకుంటే అందం పెరుగుతూ పోతుంది.యోగా మనసును, శరీరాన్ని మెరుగు పరిస్తుంది.నేను నిత్యం యోగా క్రమం తప్పకుండా చేస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement